హైదరాబాద్ 26°C
అమరావతి 30°C
IST 4:16 PM
బుధవారం జూలై 29 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
వాతావరణం

ద్రోణి ప్రభావంతో ఒడిస్సాలో భారీ వర్షాలు, వరదలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ద్రోణి ప్రభావంతో ఒడిస్సాలో భారీ వర్షాలు, వరదలు
📷 cottonbro studio / Pexels
షేర్ కాపీ అయింది ✓

ద్రోణి ప్రభావంతో ఒడిస్సాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా బాలాసోర్ జిల్లాలో కుండపోత వానలు పడుతున్నాయి.

లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీరు రోడ్లపైకి రావడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. వరద ప్రభావంతో పలు ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేశారు.

గోపాల్గావ్, గుడిపాడ, నువాసాహి, దర్జీ, పోకరి ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బైతరణి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వరద ముంపు ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు.

ఉత్తర ఒడిస్సాలోని ముంపు ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com