తెలంగాణ

తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారింది — పలు జిల్లాల్లో భారీ వర్షం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారింది — పలు జిల్లాల్లో భారీ వర్షం
📷 Sumit K Sharma / Pexels
షేర్ కాపీ అయింది ✓

కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నిర్మల్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. పగలంతా ఎండలు మండిన తర్వాత సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

కరీంనగర్‌లో విద్యుత్ తీగలపై flex బ్యానర్లు పడడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులకు రోడ్లపై ఏర్పాటు చేసిన flex బ్యానర్లు కొట్టుకుపోయాయి.

నల్గొండ జిల్లా చిట్యాల్లో ఈదురు గాలులకు చాలా చోట్ల తాటాకు రేకులు ఎగిరిపోయాయి. చిట్యాల-భువనగిరి రోడ్డుపై చెట్టు విరిగిపడటంతో అక్కడ కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కల్లాల్లో ధాన్యం రాసులపై టార్పాలిన్లు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు నష్టపోయారు.

ఖమ్మం నగరంలో వెంకటయ్యపాలెం, గోపాలపురం సహా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్, పెమ్మి మండలాల్లోనూ ఉరుములతో కూడిన వర్షం పడింది.

కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్‌పల్లి మండలాల్లో మోస్తరు వర్షం నమోదైంది. వారం రోజులుగా వడగాలులతో ఇబ్బంది పడిన ప్రజలకు వాతావరణం చల్లబడడంతో కాస్త ఊరట కలిగింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com