వాతావరణం

అల్పపీడన ప్రభావంతో ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు – హెచ్చరిక

రచన: ఉషా కిరణం డెస్క్ ·
అల్పపీడన ప్రభావంతో ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు – హెచ్చరిక
📷 cottonbro studio / Pexels
షేర్ కాపీ అయింది ✓

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్ లో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ఉత్తరకోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామ రాజు, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరి వర్షాలు, ఇతర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా.

విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రకార్ జైన్ మాట్లాడుతూ ప్రజలు వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులతో అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షం సమయంలో చెట్ల క్రింద, భారీ హోల్డింగ్స్ వద్ద నిలబడొద్దని, విద్యుత్ తీగలు తెగిపడి ఉంటే వాటికి దూరంగా ఉండాలని సూచించారు. మత్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com