హైదరాబాద్ 27°C
అమరావతి 31°C
IST 12:49 PM
సోమవారం జూలై 27 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
వాతావరణం

గుజరాత్, అస్సాంలో భారీ వర్షాలు; వరదలతో 66 మంది మృతి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
గుజరాత్, అస్సాంలో భారీ వర్షాలు; వరదలతో 66 మంది మృతి
📷 Shardar Tarikul Islam / Pexels
షేర్ కాపీ అయింది ✓

వాయుగుండం ప్రభావంతో గుజరాత్, అస్సాంతో సహా దేశంలోని 15 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్‌లో కుండపోత వర్షాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అస్సాంలో వరదలు ముంచెత్తాయి.

గుజరాత్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అహ్మదాబాద్ నగరంలో ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. గుజరాత్‌కు మరో 24 గంటల పాటు భారీ వర్షం కొనసాగుతుందని IMD హెచ్చరించింది.

అస్సాంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. ఇప్పటివరకు 66 మంది మృతి చెందారు. శివసాగర్ జిల్లాలో ముగ్గురు, చరైదేవ్ జిల్లాలో ఒకరు తాజాగా మరణించారు. ఆరు జిల్లాల్లో దాదాపు 6.5 లక్షల మంది వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే, గుజరాత్, సౌరాష్ట్ర, కచ్, కోంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలో విస్తారంగా భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. కేరళ, తీరప్రాంత కర్ణాటకలోనూ వర్షాలు కొనసాగుతాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com