హార్ముజ్ జలసంధిలో నౌకపై క్షిపణి దాడి: ఇద్దరు భారతీయ నావికులు మృతి, చీఫ్ ఇంజనీర్ గల్లంతు
హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయ నావికులు మృతి చెందగా, చీఫ్ ఇంజనీర్ గల్లంతయ్యారు.
ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ మనోజ్ యాదవ్ ఈ వివరాలు వెల్లడించారు. నౌకలోని ఇంజిన్ రూమ్‌లో క్షిపణి దాడి జరిగిందని ఆయన తెలిపారు.
నౌకలో మొత్తం 24 మంది భారతీయులు, 4 మంది విదేశీయులు ఉన్నారని యూనియన్ నాయకుడు చెప్పారు. భారత ప్రభుత్వం ఇంతకుముందు ముగ్గురు గల్లంతయినట్లు ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఇద్దరు నావికుల మృతదేహాలు లభ్యమయ్యాయని, చీఫ్ ఇంజనీర్ ఆచూకీ తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
క్రూ జాబితా ప్రకారం ఈ ముగ్గురు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారని మనోజ్ యాదవ్ వివరించారు. నౌకతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని, మేనేజ్‌మెంట్, స్థానిక యంత్రాంగం నుంచి అందిన సమాచారం మేరకు ఈ వివరాలు వెల్లడిస్తున్నామన్నారు. స్పష్టత వచ్చాకే కుటుంబాలకు సమాచారం ఇస్తామని ఆయన తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com