సౌదీ అరామ్కో రిఫైనరీపై హౌతీ తిరుగుబాటు దార్ల డ్రోన్ దాడి
హౌతీ తిరుగుబాటు దార్లు సౌదీ అరేబియాలోని అతి పెద్ద ఆరామకో చమరు రిఫైనరీపై డ్రోన్ దాడి చేశారు. ఈ దాడి వల్ల రిఫైనరీలో మంటలు చెలరేగాయి.
ఎమెన్‌పై సౌదీ జరిపిన వైమానిక దాడులకు ప్రతిగా ఈ దాడి చేసినట్లు హౌతీలు ప్రకటించారు. అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తీసుకొచ్చారు. రిఫైనరీని తాత్కాలికంగా మూసివేశారు. ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియలేదు.
ఈ ఘటనతో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
సౌదీ నౌకల రాకపోకలను అడ్డుకోవడానికి బాబ్ ఎల్ మాంబర్డ్ జలసంధిని మూసివేస్తామని హౌతీలు హెచ్చరించారు. ఈ మార్గం ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ తో కలుపుతుంది. ప్రపంచ చమరు రవాణాలో దాదాపు 12% ఇదే మార్గం గుండా జరుగుతుంది. తాజా పరిణామాలతో క్రూడ్ సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com