వర్షాకాలంలో AC ఎలా వాడాలి? నిపుణుల సలహాలు
వర్షాకాలంలో చల్లగా ఉంటుందని ఎయిర్ కండిషనర్‌ను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. గాలిలో తేమ వల్ల AC లోపలి భాగాలు పాడైపోయే ప్రమాదం ఉంటుంది.
వర్షాకాలంలో AC ఆఫ్ చేసేటప్పుడు రిమోట్‌తో ఆఫ్ చేయకుండా, మెయిన్ స్విచ్‌బోర్డ్ నుంచి ప్లగ్ తీసివేయడం మంచిది. ఆఫ్ చేసే ముందు ఫ్యాన్ మోడ్ లేదా డ్రై మోడ్‌లో పెట్టాలి. వారానికి ఒకసారి 15 నుంచి 20 నిమిషాలు డ్రై మోడ్‌లో పెడితే మోటార్ జామ్ కాకుండా, కాయిల్స్ మీద తేమ చేరకుండా నివారించవచ్చు. దీనివల్ల కంప్రెషర్ మీద లోడ్ తగ్గుతుంది.
AC ఫిల్టర్లు మురికిగా ఉంటే శ్వాసకోశ సమస్యలు రావచ్చు. ఫిల్టర్లు శుభ్రంగా ఉన్నాయా అని తరచూ చెక్ చేసి క్లీన్ చేయాలి. అలాగే కంప్రెషర్ మరియు కండెన్సర్ చుట్టూ నీరు లేకుండా చూసుకోవాలి. వాటర్‌ప్రూఫ్ కవర్లు వాడటం, డ్రైన్ పైపులో చెత్త పేరుకోకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఉరుములు, మెరుపులు, విద్యుత్ మార్పుల వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి AC పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకని స్టెబిలైజర్ ఉపయోగించాలి. AC టెంపరేచర్‌ను 18 నుంచి 20 డిగ్రీల వద్ద సెట్ చేసుకోవాలి. చాలా రోజులు ఉపయోగించకపోతే సర్వీసింగ్ చేయించిన తర్వాతే AC ని మళ్లీ ఆన్ చేయాలని నిపుణులు చెప్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com