హైదరాబాద్ అత్తాపూర్‌లో యువతిని బలవంతంగా కార్లో ఎక్కించుకెళ్ళారు
హైదరాబాద్ అత్తాపూర్‌లో అర్ధరాత్రి ఓ యువతిని నలుగురు యువకులు బలవంతంగా కార్లో ఎక్కించుకొని వెళ్ళిపోయారు. PVNR ఎక్స్‌ప్రెస్ హైవేపై 143వ పిల్లర్ వద్ద యువతి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.
స్థానికులు Dial 100కి సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే స్పందించారు. అత్తాపూర్ నుండి ఆరంగల్ చౌరస్తా వరకు ఆ వాహనాన్ని వెంబడించారు. అయితే, నిందితులు పోలీసుల కళ్లు కప్పి వేరే వైపుకు పారిపోయారు.
ఆ కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడంతో వాహన వివరాలు సేకరించడం కష్టంగా మారింది. స్థానిక DCP ఘటనాస్థలికి చేరుకొని CCTV ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.
కిడ్నాప్ అయిన యువతి ఎవరో, సంఘటన జరిగి గంటలు గడిచినా ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఇది నిజంగా కిడ్నాప్ అయిందా లేదా ముందే పరిచయమున్న వ్యక్తులు చేశారా అనే కోణంలో పోలీసులు అనేక teams వేసి దర్యాప్తు చేస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com