హైదరాబాద్‌లో భారీ వర్షం: రోడ్లు జలమయం, ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో రహదారులు నీట మునిగాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడి నగరవాసులు ఇబ్బంది పడ్డారు.
అత్యధికంగా బహదూర్‌పురాలో 8.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మాదాపూర్‌లో 7.1 సెం.మీ., కీసరలో 6.7 సెం.మీ., షేక్‌పేటలో 6.4 సెం.మీ., చార్మినార్‌లో 6.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
గచ్చిబౌలిలో వాన భారీగా కురవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో రద్దీ ఎక్కువగా ఉంది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.
మాదాపూర్ ప్రాంతంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నాలాలో ఓ డెలివరీ బాయ్ పడిపోయాడు. రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీటి ఒత్తిడికి అదుపు తప్పి ఆయన పక్కనే ఉన్న నాలాలోకి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, SDRF సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అర్జున్ కుమార్‌ను సురక్షితంగా బయటకు తీశారు.
కృష్ణానగర్ మెయిన్ రోడ్డుపై మోకాళ్ల లోతు వరద నీరు ప్రవహిస్తోంది. ఆ నీటిలో ఒక వ్యక్తి పడుకుని హంగామా చేశాడు. పక్కనే వాహనాలు వెళ్తున్నా ఆయన పట్టించుకోలేదు. ట్రాఫిక్ పోలీసులు ఆయనను రోడ్డు నుంచి పక్కకు తప్పించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com