హైదరాబాద్ 26°C
అమరావతి 28°C
IST 9:22 AM
శనివారం అక్టోబర్ 31 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

హైదరాబాద్‌లో భారీ వర్షం.. కీసరలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
హైదరాబాద్‌లో భారీ వర్షం.. కీసరలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం
📷 Shantum Singh / Pexels
షేర్ కాపీ అయింది ✓

చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. కొద్దిసేపే అయినా వాన క్లౌడ్ బరస్ట్‌లా దంచికొట్టింది. ఎండలతో అల్లాడుతున్న నగరానికి ఈ వర్షం కొంత ఉపశమనం ఇచ్చింది.

కీసరలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఓల్డ్ సిటీలోని బహదూర్‌పురాలో 8 సెంటీమీటర్లు కురిసింది. రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో 7 సెంటీమీటర్లు, మాదాపూర్‌లో 7 సెంటీమీటర్లు నమోదయ్యాయి. జూబ్లీ హిల్స్‌లో 6.2 సెంటీమీటర్లు, కూకట్‌పల్లిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది.

శంషాబాద్, రాజేంద్రనగర్, ఎల్‌బీ నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, బాలాపూర్‌లోనూ భారీ వర్షం కురిసింది. మాదాపూర్, గచ్చిబౌలి, అమీర్‌పేటలో వర్షం దంచికొట్టింది. కూకట్‌పల్లి, బంజారా హిల్స్, హైటెక్ సిటీ సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది.

El Nino ప్రభావంతో కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో ఎండలు మండిపోతున్నాయి. ఈ వర్షంతో కొన్ని బోరుబావులు రీచార్జ్ అవుతాయని, నీటి సమస్య కొంత తీరుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జడివానతో రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. విఠల్‌రావు నగర్‌లో ఫుడ్ డెలివరీకి వెళ్తున్న డెలివరీ బాయ్ బైక్‌తో సహా నాలాలో పడిపోయాడు. పోలీసులు, NDRF సిబ్బంది అతన్ని వెంటనే బయటకు తీశారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com