హైదరాబాద్-ముంబై హై స్పీడ్ రైల్ కారిడార్ DPR సిద్ధం
హైదరాబాద్-పూణే-ముంబై హై స్పీడ్ రైల్ కారిడార్ కోసం సర్వే పూర్తయింది. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) తయారు చేసి తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది.
ఈ కారిడార్ మొత్తం దూరం 671 కిలోమీటర్లు. ఇందులో 93 కిలోమీటర్లు తెలంగాణలో, 121 కిలోమీటర్లు కర్ణాటకలో, 457 కిలోమీటర్లు మహారాష్ట్రలో ఉంటాయి. గంటకు గరిష్టంగా 300 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైల్లో హైదరాబాద్ నుంచి ముంబైకి కనిష్టంగా 2 గంటల 55 నిమిషాలు, గరిష్టంగా 3 గంటల 13 నిమిషాలలో చేరుకోవచ్చు.
ప్రస్తుతం రోడ్డు మార్గంలో సుమారు 12 గంటలు, రైల్లో దాదాపు 15 గంటల సమయం పడుతోంది.
మహారాష్ట్రలో 35.30 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గం నిర్మిస్తారు. కండాల ఘాట్ ప్రాంతంలో 13 సొరంగాలు తొలిచి 24 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగుతుంది. హైదరాబాద్ మెట్రో మాదిరిగా పిల్లర్లపై ట్రాక్ నిర్మిస్తారు.
కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్లో దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో ఏడు హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులు ప్రకటించింది. ఇందులో మూడు హైదరాబాద్ నుంచి ఉన్నాయి. హైదరాబాద్-చెన్నై-బెంగళూరు కారిడార్ సర్వే దశలో ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com