తెలంగాణ

10 రోజుల్లో నాలుగుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
10 రోజుల్లో నాలుగుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి
📷 Sumit K Sharma / Pexels
షేర్ కాపీ అయింది ✓

గత 10 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగుసార్లు పెరిగాయి. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు ₹2.84, డీజిల్‌పై ₹2.86 పెంచారు. ఈ నెల 15వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంధనంపై రెండు రూపాయలు పెంచింది. 10 రోజుల్లో మొత్తం ₹8 వరకు ఇంధన ధరలు పెరిగాయి.

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు ₹115.80కు, డీజిల్ ధర ₹103.70కు చేరాయి.

ఇరాన్‌లో యుద్ధ పరిస్థితుల వల్ల ముడిచమురు సరఫరాకు అంతరాయం కలుగుతోందని ఆర్థిక నిపుణులు తెలిపారు. దాంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయని వారు వివరించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ధరల పెరుగుదలతో వాహనాదారులు ఇబ్బంది పడుతున్నారు. జీతాలు పెరగడం లేదని, కానీ పెట్రోల్ తో సహా అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయని సామాన్యులు అభిప్రాయపడ్డారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com