HYDRA మాన్సూన్ అలర్ట్: హైదరాబాద్‌లో వరద ముప్పు ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లు
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో వరద సమస్యలను అరికట్టేందుకు HYDRA ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో DRF, NDRF స్టాటిక్ టీమ్స్, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేశారు.
GHMC, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 300 వార్డుల్లో వరద ముప్పు ప్రాంతాలను అధికారులు గుర్తించారు. మూడు కార్పొరేషన్లలో దాదాపు 913 ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉన్నట్లు తేలింది. వీటిలో 257 ప్రాంతాల్లో ముప్పు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేశారు.
ప్రతి వార్డుకు ఒక మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఏర్పాటు చేశారు. 51 DRF టీములు 24 గంటలు అందుబాటులో ఉండి విధులు నిర్వర్తిస్తాయి. ట్రాఫిక్, విద్యుత్, మున్సిపల్ అధికారులు స్థానికులతో సమన్వయం చేసుకుని సహాయక చర్యల్లో పాల్గొంటారు.
ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హైడ్రా హెచ్చరించింది. మూడు కార్పొరేషన్ల పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు నివారణ చర్యలు ఇప్పటికే ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com