రామంతపూర్‌లో మధురా బార్ షెడ్‌ను కూల్చివేసిన HYDRAA
హైదరాబాద్‌లోని రామంతపూర్‌లో మధురా బార్ షెడ్‌ను HYDRAA అధికారులు కూల్చివేశారు. చెరువు FTL పరిధిలో ఉందంటూ HYDRAA అధికారులు చర్యలు చేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య బార్ షెడ్‌ను కూల్చివేశారు.
హైకోర్ట్ స్టేటస్ కో ఉత్తర్వులు ఉన్నా HYDRAA కూల్చివేస్తుందంటూ బార్ యజమానులు ఆరోపిస్తున్నారు. 40 ఏళ్లుగా పన్నులు చెల్లిస్తున్నామని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
బార్ యజమాని మాట్లాడుతూ, 1974లో తన తల్లి ఆ స్థలాన్ని కొనుగోలు చేశారని, రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉందని తెలిపారు. 1980లో అప్పటి స్పెషల్ ఆఫీసర్ అనుమతితో భవనాన్ని నిర్మించారని, దాదాపు 47 సంవత్సరాలు అయిందని పేర్కొన్నారు. ఎలాంటి నోటీస్ లేకుండా HYDRAA అధికారులు కూల్చివేత చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు మూడు రోజుల క్రితం సర్వే చేసి కొలతలు తీసుకున్నారని, దాంతో తాము కోర్ట్‌ను ఆశ్రయించామని తెలిపారు. కోర్ట్ స్టేటస్ కో సూచనలు HYDRAA కి వెళ్ళాయని, అయినా అధికారులు లెక్క చేయకుండా కూల్చివేత ప్రారంభించారని యజమాని ఆరోపించారు.
ఆ స్థలానికి హౌస్ నంబర్ ఉందని, గత 30 నుండి 40 సంవత్సరాల నుండి ప్రాపర్టీ టాక్స్ చెల్లిస్తున్నారని తెలిపారు. కరెంట్ బిల్లు, వాటర్ కనెక్షన్ కూడా ఉన్నాయని పేర్కొన్నారు. 2006లో బార్‌కు అద్దెకు ఇచ్చారని, అప్పటి నుండి ట్రేడ్ లైసెన్స్, బార్ ఎక్సైజ్ లైసెన్స్ అన్నీ ఉన్నాయని, ఇటీవలే సెప్టెంబర్‌లో రెన్యువల్ కూడా జరిగిందని తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com