హైదరాబాద్ 23°C
అమరావతి 28°C
IST 10:39 PM
గురువారం జూలై 30 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

వచ్చే 4 రోజులు తెలంగాణలో తీవ్ర వేడి: IMD అలర్ట్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
వచ్చే 4 రోజులు తెలంగాణలో తీవ్ర వేడి: IMD అలర్ట్
📷 Yogendra Singh / Pexels
షేర్ కాపీ అయింది ✓

వచ్చే నాలుగైదు రోజులు తెలంగాణలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని IMD అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని చెప్పారు.

ఈరోజు అత్యధిక ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లా భోరజ్‌లో 44.5 డిగ్రీలు నమోదైంది. కొమరంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లా బీంగల్‌లో 44.3 డిగ్రీలు రికార్డ్ అయింది. మేడ్చల్ జిల్లా మల్లాపూర్‌లో 42.5 డిగ్రీలు నమోదైంది.

భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలు మినహా మిగిలిన 29 జిల్లాలకు రేపటికి orange అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని IMD తెలిపింది.

నైరుతి రుతుపవనాలు ఈరోజు అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. మే 26న కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని IMD అధికారులు చెప్పారు. కేరళను తాకిన తర్వాత జూన్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్‌కు, జూన్ రెండవ వారంలో తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com