హైదరాబాద్ 28°C
అమరావతి 33°C
IST 11:51 AM
శనివారం జూలై 25 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం బ్రేకింగ్

17 రాష్ట్రాల్లో భారీ వర్షాలకు IMD హెచ్చరిక; అస్సాంలో 47 మంది మృతి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
17 రాష్ట్రాల్లో భారీ వర్షాలకు IMD హెచ్చరిక; అస్సాంలో 47 మంది మృతి
📷 Dibakar Roy / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఇవాల్టి నుంచి దేశంలోని 17 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. వాయువ్య, మధ్య భారతదేశంతోపాటు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చే 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఢిల్లీ, యూపీ, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్లో భారీ వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది.

అస్సాంలో బ్రహ్మపుత్ర నదితోపాటు పలు నదులు పొంగి 25 జిల్లాల్లోని వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల వల్ల ఇప్పటివరకు 47 మంది మృతి చెందగా, 70-80 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

గుజరాత్లో వల్సాద్ జిల్లాలో 24 గంటల్లో 110 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆకస్మిక వరదలతో రోడ్లు జలమయమయ్యాయి, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాలున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

హిమాచల్ ప్రదేశ్లో చంబా జిల్లాలో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న టాటా సుమో వాహనంపై కొండచరియ విరిగిపడగా, 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com