హైదరాబాద్ 26°C
అమరావతి 32°C
IST 9:48 AM
బుధవారం ఆగస్టు 5 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
వాతావరణం

తెలంగాణకు రెండు రోజుల వర్ష హెచ్చరిక, తూర్పు జిల్లాల్లో భారీ వర్ష సూచన; కామారెడ్డిలో రైతు గల్లంతు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తెలంగాణకు రెండు రోజుల వర్ష హెచ్చరిక, తూర్పు జిల్లాల్లో భారీ వర్ష సూచన; కామారెడ్డిలో రైతు గల్లంతు
📷 Raymond Petrik / Pexels
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణకు IMD రెండు రోజుల వర్ష హెచ్చరిక జారీ చేసింది. బంగాళ ఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కారణంగా లింగంపేట మండలం రాంపల్లి కోనతండాలో రైతు శ్రీహరి పెద్ద వాగులో గల్లంతయ్యాడు. అతని కోసం రెస్క్యూ టీం గాలింపు చేపట్టింది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

వర్షాలతో గోదావరి, కృష్ణా బేసిన్లలోని ప్రధాన జలాశయాలకు భారీ ఇన్ఫ్లో కొనసాగుతోంది. శ్రీరామసాగర్‌కు 25,000 క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 4,278 క్యూసెక్కులు, శ్రీశైలానికి 2,48,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. జూరాల ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తి శ్రీశైలానికి నీటిని రిలీజ్ చేస్తోంది.

రాబోయే రెండు రోజుల్లో తూర్పు ఈశాన్య జిల్లాలైన భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇటీవలి వర్షాలతో లోటు వర్షపాతం తగ్గిందని, ఆగస్టు నెలలోనూ సాధారణ వర్షపాతం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. చెరువులు నిండడంతో రైతులు పొలం పనులు ప్రారంభించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com