జీతం పెంపు లేకుండా ప్రమోషన్లు ఇస్తున్నారు: ఇండీడ్ సర్వేలో వెల్లడి
ఉద్యోగులకు హోదా పెరుగుతున్నా జీతం మాత్రం పెరగడం లేదు. ఈ ధోరణిపై జాబ్ సెర్చ్ పోర్టల్ ఇండీడ్ ఒక సర్వే నివేదిక విడుదల చేసింది. 1211 కంపెనీల్లో 2533 మంది ఉద్యోగులపై ఈ సర్వే జరిగింది.
హోదాకు, జీతానికి సంబంధం లేదని 60% మంది ఉద్యోగులు చెప్పారు. జీతం పెంచకుండా ప్రమోషన్లు ఇచ్చి హోదా మాత్రమే పెంచుతున్నారని 80% మంది తెలిపారు. గత రెండేళ్లలో ప్రమోషన్ పొందిన ప్రతి ముగ్గురిలో ఒకరికి జీతం పెరగలేదు. ఒకవేళ పెరిగినా ఆ పెంపు 5% లోపే ఉంది.
దీంతో 52% మంది ఉద్యోగులు జాబ్ మారేటప్పుడు పొజిషన్ కంటే శాలరీ హైక్కే ప్రాధాన్యం ఇస్తున్నారు. హోదా పెరిగితే భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని 70% మంది భావిస్తున్నారు. మంచి హోదా ఉంటే ఇతర కంపెనీలు తమను మెరుగ్గా చూస్తాయని 73% మంది అభిప్రాయపడ్డారు.
తమ హోదా వల్ల job satisfaction పెరిగిందని 57% మంది ఉద్యోగులు చెప్పారు. టాలెంట్ ఉన్న ఉద్యోగులను ఆకర్షించడానికి, వారిని కొనసాగించడానికి సీనియర్ సౌండింగ్ job titles ఇస్తున్నామని 57% కంపెనీలు తెలిపాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com