పెట్రోల్ ధరలు పెరిగాయి: కేంద్రం, రాష్ట్రాలు పొదుపు చర్యలు ప్రకటించాయి
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు మూడు రూపాయలకు పైగా పెంచింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు దాదాపు 110 డాలర్లకు చేరింది. ఇది భారత్ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెంచిందని నిపుణులు చెప్తున్నారు.
ఢిల్లీ ప్రభుత్వం వారానికి రెండు రోజులు ప్రభుత్వ ఉద్యోగులకు work from home అమలు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పొదుపు చర్యలకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది. CM చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తగ్గించినట్టు సమాచారం.
భారతదేశం దేశీయంగా కేవలం 10-20% మాత్రమే చమురు ఉత్పత్తి చేస్తోంది. మిగిలిన 80-90% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇంధన వినియోగం తగ్గించడం ద్వారా దిగుమతి ఖర్చు తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో internet అందుబాటు విషయంలో గ్రామ స్థాయిలో కనీసం 4G అందుబాటులో ఉందని, fiber net పథకాన్ని తిరిగి అమలు చేయాలని cabinet లో చర్చ జరిగినట్టు తెలిసింది. తదుపరి ఆరు నెలల నుంచి ఒక సంవత్సరంలో దీన్ని పూర్తి చేయాలని ప్రణాళికలు ఉన్నట్టు సమాచారం.
ఈ నిర్ణయాల నేపథ్యంలో lock down వస్తుందా అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తాయి. అయితే lock down వచ్చే పరిస్థితి లేదని, కేవలం పొదుపు చర్యలు పాటించాలని మాత్రమే ప్రభుత్వం సూచిస్తోందని TDP నాయకుడు శరత్ చౌదరి స్పష్టం చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com