అమెరికా దాడి భయంతో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొలిక్కి రాకపోతే మళ్ళీ దాడులు చేస్తామని ట్రంప్ సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది.
ఇరాన్ పౌర విమానయాన సంస్థ దేశంలోని పశ్చిమ ప్రాంతం వైపు గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు నోటం జారీ చేసింది. వాణిజ్య అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆ మార్గాల గుండా ప్రయాణించకూడదని ఆదేశించింది.
నోటం జారీ అయిన సమయంలో ఖతార్ ప్రభుత్వానికి చెందిన ఒక VIP విమానం ఇరాన్ గగనతలాన్ని దాటింది. ఆ విమానం శాంతి చర్చల కోసం టెహరాన్ కు వెళ్ళిన ఖతార్ ప్రతినిధి బృందానికి చెందినదని భావిస్తున్నారు.
ఈ పరిణామాలకు ముందు శుక్రవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ White House లో జాతీయ భద్రతా బృందంతో అత్యవసర సమావేశం నిర్వహించారు. Vice President JD Vance, రక్షణ మంత్రి Pete Hegseth, CIA డైరెక్టర్ John Ratcliffe లతో కలిసి ఇరాన్ అంశంపై సుదీర్ఘంగా సమీక్షించారని అమెరికా వార్తా సంస్థ Axios తెలిపింది.
ఇరాన్ పై భారీ సైనిక చర్య చేపట్టాలని ట్రంప్ ఆలోచిస్తున్నట్లు White House వర్గాలు తెలిపాయి. తన కుమారుడు Donald Trump Jr. వివాహానికి కూడా హాజరు కాలేనని ట్రంప్ ప్రకటించారు.
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్త దాడులకు కొన్ని గంటల ముందు కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు.
ఈ విషయంపై ఇరాన్ అధికారిక స్పందన తెలియాల్సి ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com