శాస్త్రవేత్తలతో పాటు నేరేడు చెట్టు కూడా హెచ్చరిస్తోంది
మార్కెట్లో ఈ సీజన్లో అసాధారణంగా ఎక్కువ నేరేడు పళ్ళు కనిపిస్తున్నాయి. దీని వెనక నేరేడు చెట్టు చేస్తున్న హెచ్చరిక ఏమిటో తెలుసా?
మన పెద్దవాళ్ళు చెప్పే మాట ఏమిటంటే, నేరేడు చెట్టు ఏడాదిలో ఎక్కువ కాపు కాసి ఎక్కువగా పళ్ళను రాల్చిన ఆ సంవత్సరం కచ్చితంగా కరువు వస్తుందని అంటారు. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, దీనికి వెనక శాస్త్రీయ కారణం కూడా ఉంది.
వాతావరణంలో పెద్ద మార్పులు రాబోతున్నాయని గుర్తించినప్పుడు లేదా భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని తెలుసుకున్నప్పుడు నేరేడు చెట్టు కొత్త కొమ్మలు లేదా చిగుర్లు వేయడం మానేసి ఎక్కువగా పళ్ళు కాయడం మొదలుపెడుతుంది. ఎంత ఎక్కువ పళ్ళు రాల్చితే అంత ఎక్కువ గింజలు భూమిలో పడతాయి. తద్వారా నేరేడు చెట్టు తన జాతిని కాపాడుకుంటుంది.
నేరేడు చెట్ల వేళ్ళు చాలా లోతుగా భూమిలోకి వెళ్తాయి. అందువల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని చెట్టుకు ముందుగానే తెలిసిపోతుంది. ఆ సంకేతానికి స్పందించి అది విపరీతంగా కాపు కాస్తుంది.
ఈసారి El Nino తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆ హెచ్చరికనే నేరేడు చెట్టు కూడా తన సహజమైన పద్ధతిలో చేస్తోంది. శాస్త్రవేత్తల హెచ్చరిక, నేరేడు చెట్టు హెచ్చరిక రెండూ ఒకే విషయాన్ని చెప్తున్నాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com