జపాన్‌లో తొలి ఒస్మాటిక్ పవర్ ప్లాంట్: నదీ సముద్ర జలాల మిక్సింగ్‌తో క్లీన్ ఎనర్జీ
జపాన్ లోని ఫుకుయోకా నగరంలో దేశంలోనే మొట్టమొదటి ఒస్మాటిక్ పవర్ ప్లాంట్ ప్రారంభమైంది. నది నుంచి వచ్చే మంచి నీరు సముద్రంలో కలిసే క్రమంలో సహజంగా జరిగే ఉప్పు-నీటి మిక్సింగ్ సూత్రాన్ని ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. Mamizu Pia డీశాలినేషన్ కేంద్రంలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేశారు.
ఈ ప్లాంట్ ప్రెషర్ రిటార్డెడ్ ఒస్మోసిస్ (PRO) అనే ప్రక్రియ ద్వారా పనిచేస్తుంది. ఇందులో అధిక ఉప్పు సాంద్రత కలిగిన సముద్ర జలం, శుద్ధి చేసిన మురుగు నీటిని ఒకేసారి ప్రవహింపజేస్తారు. మంచి నీరు ఉప్పు నీటి వైపు వేగంగా ప్రవేశించడంతో అక్కడ నీటి పరిమాణం, ఒత్తిడి ఒకేసారి పెరుగుతాయి. ఈ తీవ్రమైన నీటి ప్రవాహ ఒత్తిడి టర్బైన్‌ను తిప్పుతుంది. దీని ద్వారా జనరేటర్ సాయంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియలో ఎలాంటి ఇంధనం వాడరు, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు కూడా ఉండవు.
ప్రస్తుతం ఈ ప్లాంట్ సంవత్సరానికి 8,80,000 కిలోవాట్ అవర్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఇది దాదాపు 300 జపానీయ కుటుంబాల అవసరాలకు సరిపోతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది వాతావరణంపై ఆధారపడదు. ఎండ లేదా గాలి లేకపోయినా 90% సామర్థ్యంతో రోజుకు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వగలదు.
డెన్మార్క్ తర్వాత ప్రపంచంలోనే ఇలాంటి రెండో ప్లాంట్ ఇది. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా నదీముఖ ద్వారాల వద్ద ఈ బ్లూ ఎనర్జీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు ఈ ప్రయోగం మార్గదర్శిగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com