కాకినాడ జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు: పది రోజులైనా ఆచూకీ లేదు
కాకినాడలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి తప్పిపోయి పది రోజులు అవుతున్నా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఆ పాప చివరిసారిగా తమ ఇంటి దగ్గరి తోటలో ఒక చెట్టు వద్ద కనిపించినట్లు CC కెమెరా దృశ్యాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ చెట్టు దాటిన తర్వాత పాప ఏమైపోయిందో తెలియట్లేదు. జ్ఞానేశ్వరి తండ్రి బయటికి వెళ్లినప్పుడల్లా వెనక పరిగెత్తే అలవాటు ఉందని కుటుంబసభ్యులు చెప్తున్నారు. అదే సమయంలో వారి పెంపుడు కుక్క కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ కుక్క postmortem నివేదిక వస్తే కేసులో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. నివేదికలో విషం జాడలు కనిపిస్తే కిడ్నాప్ అనుమానం బలపడుతుందని చెప్తున్నారు.
Deputy CM పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు NDRF మరియు Rapid Special Force బృందాలు సోదాలు నిర్వహించాయి. SP కి అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయినప్పటికీ ఇంతవరకు పాప ఆచూకీ దొరకలేదు. పాప తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. జ్ఞానేశ్వరి ఇంట్లో ఆడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నారి త్వరగా కనుగొనబడి తల్లిదండ్రుల దగ్గరికి చేరాలని ప్రజలు కోరుకుంటున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com