ఆధ్యాత్మికం

కరవీర వ్రతంతో సూర్య-విష్ణు అనుగ్రహం; 21 సార్లు చదివితే ఫలితం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కరవీర వ్రతంతో సూర్య-విష్ణు అనుగ్రహం; 21 సార్లు చదివితే ఫలితం
📷 Prasanjeet Shyam / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఈ రోజు నుంచి జేష్ట మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన ఈ మాసంలో చేసే పూజలు, దానాలు ప్రత్యేక ఫలితాలనిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. జేష్ట శుక్ల పాడ్యమి రోజున కరవీర వ్రతం ఆచరించడం వల్ల సూర్యుడు, విష్ణువు ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది.

ఈ వ్రతం కోసం దగ్గరలోని గన్నేరు చెట్టు వద్దకు వెళ్లాలి. బియ్యపిండితో ముగ్గు వేసి, పసుపు-కుంకుమ ఉంచి, పుష్పాలు సమర్పించి, దీపం వెలిగించాలి. తర్వాత గన్నేరు చెట్టుకు 12 సార్లు ప్రదక్షిణ చేస్తే ద్వాదశ ఆదిత్యుల అనుగ్రహంతో పాటు సమస్త శుభాలు కలుగుతాయని ధర్మసింధు, నిర్ణయసింధు వంటి ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి.

దగ్గరలో గన్నేరు చెట్టు లేనివారు ఇంట్లో దీపం వెలిగించి "ఓం కరవీరాయై భాను వల్లభాయై నమః" అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకుంటే చాలు. ఇలా చేసినా సూర్య, విష్ణు అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. అలాగే జేష్ట మాసంలో శుక్ల పక్ష తదియ నాడు "రంభా వ్రతం" లేదా "కదలి గౌరీ వ్రతం" పేరుతో అరిటి చెట్టును కూడా పూజిస్తారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com