కర్నాటక చెత్తతో తెలంగాణ సరిహద్దు గ్రామాలు అల్లాడుతున్నాయి
సంగారెడ్డి జిల్లా నేల్కల్ మండలంలోని మల్కి గ్రామం కర్నాటక వ్యర్థాల వల్ల తీవ్రంగా నష్టపోతోంది. కర్నాటకలోని బీదర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిరోజు 40 టన్నులకు పైగా చెత్తను సేకరించి సుల్తాన్పూర్ డంపింగ్ యార్డ్ కు తరలిస్తోంది. ఈ వాహనాలు తెలంగాణ పరిధిలోని మల్కి గ్రామం మీదుగా వెళ్తున్నాయి.
వాహనాల నుంచి కారే మురుగు నీరు రోడ్లపై పడి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. సుల్తాన్పూర్ డంపింగ్ యార్డ్ తెలంగాణ సరిహద్దు గ్రామాలకు ఆనుకొని ఉంది. నిబంధనల ప్రకారం చెత్తను recycle చేయాల్సి ఉండగా, అక్కడ బహిరంగంగా చెత్తకు నిప్పు పెడుతున్నారు. ఆ పొగ మల్కి సహా పరిసర గ్రామాలకు కమ్మేస్తోంది.
స్థానికులు మూడు నాలుగు సంవత్సరాలుగా స్వచ్ఛమైన గాలి లేదని చెప్తున్నారు. రైతులు పొలాలకు వెళ్లలేకపోతున్నారు. పంట పొలాలు మురుగు నీటితో కలుషితమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ వల్ల కుక్కల బెడద కూడా పెరిగింది. దీంతో రెండు, మూడు సంవత్సరాలుగా కొన్ని పొలాలు పడావుగా ఉన్నాయని స్థానికులు తెలిపారు.
గ్రామస్థులు చెత్త వాహనాలను అడ్డుకున్నారు. దీంతో బీదర్ నగరంలో చెత్తకుప్పలు పేరుకుపోయాయి. ఆందోళనకారులను బీదర్ పోలీసులు బెదిరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై కర్నాటక ప్రభుత్వం స్పందన తెలియాల్సి ఉంది.
బీదర్ మున్సిపాలిటీ సుల్తాన్పూర్ లో waste processing యూనిట్ నిర్మిస్తామని గతంలో ప్రకటించింది. అది నేటికీ అమలు కాలేదని స్థానికులు చెప్తున్నారు. సంగారెడ్డి జిల్లా అధికారులు మరియు తెలంగాణ ప్రభుత్వం కర్నాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి మల్కి రూట్ నుంచి చెత్త తరళింపును అడ్డుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com