కర్ణాటకలో ఆల్చిప్పల సేకరణకు వెళ్లి 10 మంది మృతి
కర్ణాటక బత్కల్ తాలూకా సిరాలి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని 14 మంది తత్యహక్కల నదిలో ఆల్చిప్పలు సేకరించేందుకు వెళ్లారు. నదిలో దిగిన సమయంలో ప్రవాహ వేగం పెరగడంతో ముగ్గురు కొట్టుకుపోయారు. వారిని రక్షించేందుకు ప్రయత్నించిన మిగతా కుటుంబ సభ్యులు కూడా ప్రవాహంలో చిక్కుకున్నారు.
ముందురోజు రాత్రి కురిసిన వర్షాల వల్ల నది ఉదృతంగా ప్రవహిస్తున్నప్పటికీ ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. స్థానిక జాలర్లు మరియు పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. మొత్తం 10 మంది మృతి చెందారు. ఇద్దరు మహిళలు బయటపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతుల్లో 9 మంది మహిళలు, ఒక్కరే పురుషుడు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com