హైదరాబాద్ 30°C
అమరావతి 32°C
IST 12:47 PM
శనివారం ఆగస్టు 1 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
వాతావరణం

కేరళలో భారీ వర్షాలు: వరదలు, కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కేరళలో భారీ వర్షాలు: వరదలు, కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి
📷 Jonathan / Pexels
షేర్ కాపీ అయింది ✓

కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇడుక్కి, పతనంతిట్ట, కొట్టాయం జిల్లాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడుతున్నాయి.

ఇడుక్కి జిల్లా వాగమన్ ప్రాంతంలో ఇంటిపై కొండచరియలు విరిగిపడడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు వైకోమ్ కు చెందిన ప్రభాకరన్ గా గుర్తించారు. ఆడూర్ ప్రాంతంలో కూడా కొండచరియలు విరిగిపడగా, అక్కడ మరొక వ్యక్తి చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

పంపా నది ఉప్పొంగడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. రహదారులు జలమయమై, కొట్టాయం పతనంతిట్టలో ఇళ్లల్లోకి వరద నీరు వచ్చింది. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

ఇడుక్కి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో కల్లారకుట్టి డ్యామ్‌కు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు డ్యామ్‌లోని ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com