హైదరాబాద్ 27°C
అమరావతి 27°C
IST 5:24 PM
బుధవారం నవంబర్ 4 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ బ్రేకింగ్

ఖమ్మంలో భారీ వర్షాలు: 15 గ్రామాలకు రాకపోకలు బంద్, పంటలకు నష్టం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఖమ్మంలో భారీ వర్షాలు: 15 గ్రామాలకు రాకపోకలు బంద్, పంటలకు నష్టం
📷 Alotrobo / Pexels
షేర్ కాపీ అయింది ✓

మొరుసు తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో సుమారు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

కొనిజర్ల మండలం అంజనాపురం గ్రామం సమీపంలో నిమ్మ వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలిపాడు నుంచి ఏన్కూరు వైపు వెళ్లే రహదారిని రెవెన్యూ, పోలీస్ అధికారులు మూసివేశారు. తీగల బంజర సమీపంలో పగిడేరు వాగు వరద ఉధృతి కూడా పెరుగుతోంది. తల్లాడ మండలంలో రామచంద్రాపురం నుంచి వెంకటగిరి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఏన్కూరు మండలం గంగుల నాచారంలో వాగు ఉదృతంగా ప్రవహించడంతో బ్రిడ్జి పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. గ్రామానికి రాకపోకలు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, అత్యవసర వైద్యం అవసరమయ్యే రోగులు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

వైరా, కొనిజర్ల మండలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు వర్షాలకు నేలకొరిగాయి. పత్తి పంట తడిసి నల్లబడుతుండడంతో నాణ్యత తగ్గి దిగుబడి, మార్కెట్ ధరపై ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం వెంటనే పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com