తెలంగాణ

సింగరేణి నిర్వహణపై సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
సింగరేణి నిర్వహణపై సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
📷 Batthini Vinay Kumar Goud / Wikimedia Commons / cc-by-sa
షేర్ కాపీ అయింది ✓

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి సంస్థ నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సింగరేణిలో సమర్ధవంతమైన నిర్వహణ కోసం సేఫ్గార్డ్స్ మెకానిజం, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టం పై సీఎం సమీక్షించాలని సూచించారు.

లోపాలను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు ఈ సమీక్ష ఉపయోగపడుతుందని తెలిపారు. సింగరేణి కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా లేఖలో కోరారు.

ఈ లేఖపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com