దుబాయ్‌లో కోనసీమ వ్యక్తి అదృశ్యం — కుటుంబం ప్రభుత్వాన్ని వేడుకుంటోంది
అంబేద్కర్ కోనసీమ జిల్లా సెకనేటిపల్లికి చెందిన లంకె లక్ష్మణుడు దుబాయ్‌లో మిస్సింగ్ అయ్యాడు. 40 రోజులుగా అతని నుండి ఎలాంటి సమాచారం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
లక్ష్మణుడు 7 సంవత్సరాల క్రితం దుబాయ్‌లోని Oak International Technical Services అనే కంపెనీలో కార్పెంటర్‌గా పని చేయడానికి వెళ్ళాడు. సంవత్సరం క్రితం వచ్చి తిరిగి వెళ్ళిన మూడు నెలలకే అతని వీసా గడువు ముగిసింది. కంపెనీ యాజమాని వీసా renew చేయలేదు. అప్పటి నుండి లక్ష్మణుడు room కే పరిమితమయ్యాడు.
వీసా గడువు ముగిసి 9 నెలలు అయింది. Salary కూడా ఇవ్వలేదని కుమార్తె తెలిపింది. 17వ తేదీన Abu Dhabi లో పోలీసులు తనిఖీ చేసినప్పుడు లక్ష్మణుడిని తీసుకెళ్ళిపోయారని ఆమె పేర్కొంది.
భర్త ఆచూకీ తెలుసుకుని తిరిగి ఇండియాకు రప్పించాలని అతని భార్య ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తోంది. కంపెనీ యాజమానికి ఫోన్ చేసినా స్పందన లేదని ఆమె తెలిపింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com