హైదరాబాద్ 26°C
అమరావతి 29°C
IST 2:47 PM
సోమవారం నవంబర్ 2 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

కొండగట్టు ఆంజనేయ స్వామికి 60 ఏళ్ల తర్వాత చందనోత్సవం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కొండగట్టు ఆంజనేయ స్వామికి 60 ఏళ్ల తర్వాత చందనోత్సవం
📷 Benhur Emmanuel / Pexels
షేర్ కాపీ అయింది ✓

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో 60 ఏళ్ల తర్వాత చందనోత్సవం నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 16 నుంచి 20 వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించనున్నారు.

మూలవిరాట్‌పై ఉన్న చందనాన్ని ఈ ఉత్సవాల్లో తొలగించనున్నారు. ప్రధాన గోపురంపై కలశాల స్థాపన చేయనున్నారు. గోపురాలపై ధ్వంసమైన సుదర్శన చక్రాలు, శిథిలమైన దేవతా మూర్తుల విగ్రహాలను మరమ్మతు చేయించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు.

చందనం తొలగించే సమయంలో వాహన పూజలు మినహా మిగతా ఆర్జిత సేవలను రద్దు చేశారు. దైవదర్శనం కూడా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ మండపంలో చెక్కతో చేసిన ఉత్సవ మూర్తిని ప్రతిష్ఠించి దర్శనం కల్పిస్తామని చెప్పారు.

గతంలో అర్చకులు ప్రతి శనివారం మాత్రమే మూలవిరాట్‌ను చందనంతో అలంకరించేవారు. కొన్నేళ్ల తర్వాత విగ్రహంపై రెండు అడుగుల మందం చందనం ఏర్పడింది. ఎలుకలు బొరియలు చేయడంతో చందనం రాలిపోవడం మొదలైంది. దీంతో 60 ఏళ్ల క్రితం తొలిసారిగా చందనోత్సవం నిర్వహించారు. అంతకుముందు స్వామి నిజరూపం ఎలా ఉండేదో ఎవరికీ తెలియదు. అప్పటి చిత్రకారుడు అలిసెట్టి మహారాజు గీసిన చిత్రం ద్వారా ఆ ఆకారం ప్రచారంలోకి వచ్చింది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, దేవాదాయ శాఖ ఉన్నత అధికారులకు ఆహ్వానాలు అందజేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఉత్సవాల్లో నిధుల దుర్వినియోగం జరగకూడదని భక్తులు సూచిస్తున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com