విజయనగరం జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని జామి మండలంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన మంత్రి, ఆసుపత్రి పరిసరాలు, వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఆసుపత్రి అపరిశుభ్రంగా ఉన్నందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేకంగా ప్రసూతి, బాలింతల గది పరిస్థితి దారుణంగా ఉన్నట్లు గుర్తించారు. గదిలో దుమ్ము, రక్తపు మరకలు, స్టెరిలైజేషన్ పరికరాలు సరిగా లేకపోవడం, టేబుల్‌పై బ్లడ్ స్టెయిన్స్ కనిపించాయి.
వైద్యులు, సిబ్బంది శుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహించడంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రసూతి గదిలో ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉందని, తల్లి, శిశువుల ఆరోగ్యానికి హాని కలుగుతుందని హెచ్చరించారు.
కనీస శుభ్రత పాటించాలని, హాస్పిటల్ సౌకర్యాలను మెరుగుపరచాలని సూచించారు. ఈ వ్యవహారంపై ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బందికి మంత్రి క్లాస్ పీకారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com