హైదరాబాద్ 30°C
అమరావతి 32°C
IST 6:34 PM
గురువారం జూలై 9 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

కూకట్‌పల్లి రెస్టారెంట్‌లో కిచెన్‌లో పిల్లులు, గడువు ముగిసిన లైసెన్స్‌; నోటీసులు జారీ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కూకట్‌పల్లి రెస్టారెంట్‌లో కిచెన్‌లో పిల్లులు, గడువు ముగిసిన లైసెన్స్‌; నోటీసులు జారీ
📷 Sumit K Sharma / Pexels
షేర్ కాపీ అయింది ✓

కూకట్‌పల్లి లోని శ్రీ ద్వారక గ్రాండ్ రెస్టారెంట్‌లో ఆహార భద్రత అధికారులు నిర్వహించిన తనికీలో గడువు ముగిసిన లైసెన్స్‌తో నిర్వహిస్తున్నట్లు, కిచెన్‌లో పిల్లులను పెంచుతున్నట్లు బయటపడింది.

రెస్టారెంట్ కిచెన్ అంతా అపరిశుభ్రంగా ఉండటంతో పాటు కిచెన్ లోనే పిల్లులు సంచరించడాన్ని అధికారులు గుర్తించారు. ఆహారం తయారీ ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే రెస్టారెంట్‌ను మూసివేయాలని యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. కిచెన్ పరిస్థితులు సరి చేసుకునే వరకు హోటల్ నిర్వహించరాదని సూచించారు.

హైదరాబాద్ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనీకీలు కొనసాగిస్తున్నారు. ఇటీవల పలు హోటళ్లలో అపరిశుభ్రత బయటపడటంతో ఈ తనీకీలను ముమ్మరం చేశారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com