మహానాడు వేదికగా లోకేష్ 'బిగ్ అనౌన్స్‌మెంట్' — TDP లో ఏం జరగబోతోంది?
TDP వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ మహానాడు కార్యక్రమంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రసంగించనున్నారు. X (ట్విట్టర్) లో పోస్ట్ చేస్తూ "బిగ్ అనౌన్స్‌మెంట్" ఉంటుందని లోకేష్ తెలిపారు.
ఈ ప్రకటన TDP వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తన మొదటి ప్రసంగంలో చేస్తారని లోకేష్ పోస్ట్ లో పేర్కొన్నారు. దీంతో TDP నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.
నియోజకవర్గాల వారిగా యువ నాయకులను ఇన్‌చార్జ్‌లుగా నియమించే అవకాశం ఉందని, రాజధాని అభివృద్ధికి సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, IT శాఖ మరియు skill development కు సంబంధించిన ఉద్యోగ అవకాశాలపై ప్రకటన చేయవచ్చని పలు అంశాలు చర్చలో ఉన్నాయి.
ప్రకటన చేయడానికి ముందుగా CM చంద్రబాబు నాయుడుతో సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రకటన వివరాలు మధ్యాహ్నం తెలియాల్సి ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com