మంచిర్యాల జిల్లా నర్స్‌పూర్‌లో లారీ డ్రైవర్ మృతి
మంచిర్యాల జిల్లా నర్స్‌పూర్ గోదాం వద్ద లారీ డ్రైవర్ మృతి చెందాడు. అదిలాబాద్ జిల్లా మొర్నూరు గ్రామానికి చెందిన శంకర్ మొక్కజొన్న పంటను లోడ్ చేసుకొని ఆరు రోజుల క్రితం నర్స్‌పూర్ గోదాం వద్దకు వచ్చాడు.
ఆరు రోజులు గడిచినా అన్‌లోడింగ్ జరగలేదు. సరైన తిండి, నీరు లేక ఇబ్బంది పడిన శంకర్ రాత్రి లారీపై నిద్రించాడు. నిద్రలో పైనుంచి కిందపడి మృతి చెందాడు.
ఈ ఘటనతో గోదాం వద్ద ఉన్న ఇతర లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే డ్రైవర్ మరణించాడని వారు ఆరోపించారు. మృతుడి కుటుంబానికి సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా డ్రైవర్లు ఆందోళన కొనసాగించారు. తర్వాత అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదిలాబాద్ నుంచి కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహిస్తారని తెలుస్తోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com