జాతీయం

పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో స్టింగ్ ఎనర్జీ డ్రింక్ అమ్మకాలు నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో స్టింగ్ ఎనర్జీ డ్రింక్ అమ్మకాలు నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
📷 Andy Barbour / Pexels
షేర్ కాపీ అయింది ✓

మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో స్టింగ్ ఎనర్జీ డ్రింక్ అమ్మకాలను నిషేధించనుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆహార ఔషధ పరిపాలన శాఖ (FDA) వెల్లడించింది.

ఎనర్జీ డ్రింక్‌ల్లో కెఫిన్, చక్కెర శాతం చాలా అధికంగా ఉండటం వల్ల చిన్న పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరించారు. నిద్రలేమి, ఆందోళన, ఏకాగ్రత లోపించడం, గుండె సంబంధిత సమస్యలు రావచ్చని వైద్యులు చెబుతున్నారు.

అసెంబ్లీలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు FDA మంత్రి నరహరి జిర్వాల్ సమాధానం ఇస్తూ, విద్యార్థులను ఈ తరహా డ్రింక్స్ నుంచి దూరంగా ఉంచేందుకు త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి పాఠశాలలో ఎనర్జీ డ్రింక్ల వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com