మక్తల్-నారాయణపేట 4-లైన్ల రోడ్డుకు రూ.237 కోట్లతో శంకుస్థాపన
మక్తల్ నియోజకవర్గంలో రూ.237 కోట్లతో నిర్మించనున్న నాలుగు లైన్ల మక్తల్-నారాయణపేట రహదారికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రియాంకతో కలిసి వీరు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పైలాన్ను ఆవిష్కరించారు. మక్తల్-నారాయణపేట మధ్య రహదారి నిర్మాణం చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని, రవాణా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఈ రోడ్డుకు సంబంధించి అనేక హామీలు ఇచ్చినా ఆచరణలో పెట్టలేదని, రంగుల బొమ్మలు చూపించడం మినహా పనులు జరగలేదని వాకిటి శ్రీహరి ఆరోపించారు. ఈ నాలుగు లైన్ల రహదారితో నియోజకవర్గానికి, జిల్లా కేంద్రానికి మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుందన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com