మాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయం చేసి NRI సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు క్రిప్టో స్కామ్
విజయవాడకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మాట్రిమోనీ సైట్ ద్వారా క్రిప్టో స్కామ్‌లో ₹36 లక్షలు పోగొట్టుకున్నాడు. UK లో పని చేస్తున్న ఈ యువకుడు మాట్రిమోనియల్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోగా, కావ్య పేరుతో ఓ యువతి పెళ్లి request పంపించింది.
గతేడాది అక్టోబర్ నుంచి ఆమె తరచూ ఫోన్‌లో మాట్లాడటం మొదలుపెట్టింది. తానూ విజయవాడకే చెందినవారమని చెప్పి దగ్గరైంది. కొన్ని రోజుల తర్వాత క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని చెప్పింది.
ఆమె పంపిన రెండు links ద్వారా యువకుడు తన ICICI bank ఖాతా నుంచి విడతల వారిగా ₹36 లక్షలు వేర్వేరు bank ఖాతాలకు బదిలీ చేశాడు. లాభాలు వస్తున్నట్లు చూపించారు. తీరా డబ్బు వెనక్కి అడిగినప్పుడు సమాధానం రాలేదు. చివరకు ఆమె ఫోన్ switch off చేసింది.
యువకుడు ఆమె ఇచ్చిన విజయవాడ చిరునామాను స్నేహితుని ద్వారా verify చేయించగా అది తప్పుడు చిరునామాగా తేలింది. దీంతో స్నేహితుని ద్వారా విజయవాడ సైబర్ క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదే తరహాలో US లో పని చేస్తున్న మరో NRI సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి ₹50 లక్షలు మోసగించిన కేసు కూడా నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ రెండు కేసుల్లోనూ బాధితులు NRI లు కావడం, మోసగాళ్లు విజయవాడ అమ్మాయిల profile పెట్టుకోవడం గమనించారు.
మాట్రిమోనీ సైట్‌లో పరిచయమైన వ్యక్తులను నేరుగా కలిసి మాట్లాడాలని, online పరిచయాల ద్వారా క్రిప్టో పెట్టుబడులు చేయొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com