మెదక్ జిల్లా చీలపల్లి చోరీ కేసు 10 రోజుల్లో చేదించిన పోలీసులు
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని చీలపల్లిలో ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నాలుగు ఇళ్లలో చోరీలు జరిగాయి. దొంగలు భారీగా నగదు, నగలు ఎత్తుకెళ్ళారు.
ఒక కుటుంబం పెళ్లి కార్యక్రమానికి బాన్స్వాడ వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడ్డారు. బీరువాలో ఉన్న సుమారు 120 తులాల బంగారు ఆభరణాలు, ఒక కిలో వెండి దోచుకెళ్ళారు. గ్రామంలో మరో మూడు ఇళ్లలో కూడా చోరీలకు పాల్పడ్డారు.
మెదక్ SP, DSP లు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. clues team సహాయంతో ఆధారాలు సేకరించారు. ఐదు పోలీసు బృందాలు గాలించాయి. 10 రోజుల్లో రామాయంపేట వద్ద ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు.
ప్రధాన నిందితుడు సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం బిబ్యానాయక్ తండాకు చెందిన జయరామ్ నాయక్ జాదవ్. ఇతను తన బావ ఇప్పు సింగ్‌తో కలిసి చోరీలు చేశాడు. దొంగిలించిన సొత్తును జయరామ్ తల్లి మాలి చెల్లి సాంబాయి దాచిపెట్టేది. చోరీకి పాల్పడింది ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు.
రికవరీ చేసిన సొత్తులో 92.9 గ్రాముల బంగారం, 1.7 kg వెండి ఉన్నాయి. దొంగిలించిన వస్తువుల మొత్తం విలువ దాదాపు ₹1.30 కోట్లని పోలీసులు తెలిపారు.
తాళం వేసిన ఇళ్లను దొంగలు టార్గెట్ చేస్తున్నారని పోలీసులు హెచ్చరించారు. ఊరికి వెళ్లేటప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com