గద్వాల్‌లో నేడు మెడికో ప్రియాంక అంత్యక్రియలు
ఈ నెల 3వ తేదీన రాజమహేంద్రవరంలో దుండగులు మద్యం మత్తులో కారుతో ప్రియాంక అనే మెడికో విద్యార్థిని ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు.
ఈ రోజు గాంధీ ఆస్పత్రిలో ఆమె మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.
ప్రియాంక స్వగ్రామం గద్వాల్ జిల్లా ఎక్లాస్పూర్‌లో ఈ సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో మృతదేహం వద్ద తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి, రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com