80 మిల్లీ గ్రాముల బంగారంతో భోగాపురం విమానాశ్రయం లోగో తయారు చేసిన సూక్ష్మ కళాకారుడు
సూక్ష్మ కళాకారుడు కొత్తపల్లి రమేష్ 80 మిల్లీ గ్రాముల బంగారంతో భోగాపురం విమానాశ్రయం గోల్డెన్ లోగో తయారు చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీ బుగ్గకు చెందిన రమేష్ ఈ లోగోను గుండుసూది మీద నిలిచే స్థాయిలో రూపొందించారు. విమానం ఆకారంలో ఉన్న ఈ లోగోపై ఉత్తరాంధ్ర కీర్తి కిరీటంగా పేర్కొంటున్న భోగాపురం విమానాశ్రయం పేరు సువర్ణాక్షరాలతో ముద్రించారు.
ఈ లోగోను 80 మిల్లీ గ్రాముల బంగారం రేకుతో కేవలం రెండు గంటల్లో పూర్తి చేశానని రమేష్ తెలిపారు. ఆ బంగారం విలువ సుమారు 800 రూపాయలు మాత్రమేనని ఆయన చెప్పారు. విమానాశ్రయం ఒకటవ తేదీన జాతికి అంకితం కానున్న నేపథ్యంలో, ఈ అరుదైన లోగోను బంగారంతో రూపొందించినట్లు వెల్లడించారు.
కాగా, ఈ లోగోను త్వరలోనే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు అందచేయనున్నట్లు రమేష్ ప్రకటించారు. భోగాపురం విమానాశ్రయం ఈ ఏడాది జూన్ నెలలో ప్రారంభం కానున్నట్లు మంత్రి ఇదివరకు తెలిపిన సంగతి తెలిసిందే.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com