దోర్నాలలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు
మంత్రి గొట్టిపాటి రవికుమార్ మార్కాపురం జిల్లా దోర్నాలను సందర్శించారు. దోర్నాలపట్నంలో కొత్తగా నిర్మించనున్న RTC bus stand కు శంకుస్థాపన చేశారు.
సాగర్ నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, ఈ నీటి విడుదల దోర్నాల ప్రజలకు ఊరట కలిగిస్తుందని తెలిపారు.
చిన్న గుడిపాడు గ్రామంలోని SC పాలెంలో PM సూర్యఘర్ పథకం కింద ఇంటింటికి ఉచిత solar విద్యుత్ connections ప్రారంభించారు. ఈ పథకం వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలకు విద్యుత్ ఖర్చు తగ్గుతుందని, స్వయంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం సాధ్యమవుతుందని మంత్రి చెప్పారు.
మార్కాపురం జిల్లా ఏర్పాటు, వెలగొండ ప్రాజెక్టు పురోగతిపై కూడా మంత్రి మాట్లాడారు. వెలగొండ ప్రాజెక్టుకు సుమారు ₹500 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com