కూకట్పల్లి జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని MLA మాధవరం డిమాండ్
కూకట్పల్లి MLA మాధవరం కృష్ణారావు కాయితలాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు.
రేపు జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో అమృత్ నగర్ తండా ప్రజలకు 62 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ జరగనుంది. ఇళ్ల పంపిణీ వివరాలపై MLA అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆ ఇళ్లలో కొన్నింటిని కూకట్పల్లి నియోజకవర్గంలో పని చేస్తున్న జర్నలిస్టులకు కేటాయించాలని MLA మాధవరం కృష్ణారావు కోరారు. ఈ విషయమై మంత్రి శ్రీధర్ బాబుకు వినతిపత్రం ఇస్తామని తెలిపారు.
కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించిన వారికే 144 ఇళ్లు దక్కాలని MLA పేర్కొన్నారు. ఇప్పటివరకు 61,000 మందికి ఇళ్లు ఇచ్చారని, మరో 39,000 మందికి ఇవ్వాల్సి ఉందని ఆయన తెలిపారు. స్థానిక జర్నలిస్టులు కూడా ఈ పథకంలో దరఖాస్తు చేసుకున్నారని, వారికి కూడా ఇళ్లు కేటాయించాలని MRO, కలెక్టర్‌కు కోరుతున్నట్టు చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com