MMTS ను యాదగిరి గుట్ట వరకు పొడిగిస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో పలు రైల్వే ప్రాజెక్టుల వివరాలు వెల్లడించారు. ₹720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రా ఆమృత భారత్ పథకం కింద గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 15 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ పనులను దక్షిణ మధ్య రైల్వే చేపట్టిందని చెప్పారు. ఓల్డ్ సిటీ, ఉప్పుగూడా, మల్కాజగిరి రైల్వే స్టేషన్ల పనులను ఆయన పరిశీలించారు.
MMTS సెకండ్ ఫేజ్ పనులు చేపట్టనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెట్‌వర్క్ ద్వారా MMTS ను యాదగిరి గుట్ట వరకు పొడిగిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ నుండి పూణే, బెంగళూరు, చెన్నైకి మూడు హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు చేపట్టనున్నట్లు కూడా వెల్లడించారు.
కొమరవెల్లి మల్లన్న దేవస్థానానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం కొత్త రైల్వే స్టేషన్ నిర్మించినట్లు తెలిపారు. ఈ నెల చివరి వారంలో కొమరవెల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com