తెలంగాణ

చేవెళ్లలో వృద్ధురాలిని హత్య చేసి నగలు దొంగిలించారు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
చేవెళ్లలో వృద్ధురాలిని హత్య చేసి నగలు దొంగిలించారు
📷 Alexander Zvir / Pexels
షేర్ కాపీ అయింది ✓

రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో మైసమ్మ అనే వృద్ధురాలిని దుండగులు హత్య చేసి ఆమె నగలు దొంగిలించారు.

ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు తీయడానికి దుండగులు గొంతు కోసి హత్య చేశారు. ఆమె కాళ్ళకు ఉన్న వెండి కడియాలు తీసుకోవడానికి రెండు కాళ్ళు నరికారు.

మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆమె ఒంటిపై ఉన్న నగలు లేకపోవడం, గాయాల తీరు బట్టి నగల కోసమే హత్య జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

పోలీసులు clues team సహాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ఇంకా పట్టుబడలేదు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com