జాతీయం

దక్షిణ కొరియాలో నారా లోకేష్ పర్యటన: షూ ఆల్స్ సంస్థ చైర్మన్‌తో భేటీ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
దక్షిణ కొరియాలో నారా లోకేష్ పర్యటన: షూ ఆల్స్ సంస్థ చైర్మన్‌తో భేటీ
📷 Element5 Digital / Pexels
షేర్ కాపీ అయింది ✓

దక్షిణ కొరియాలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. పలు సంస్థలతో లోకేష్ వరుసగా భేటీ అవుతున్నారు. సౌత్ కొరియాకు చెందిన ప్రఖ్యాత మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్‌వేర్ సంస్థ షూ ఆల్స్ కంపెనీ చైర్మన్ అండ్ CEO లీ చియాంగ్ ఎన్‌తో లోకేష్ సమావేశమయ్యారు.

షూ ఆల్స్ సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న MOU మేరకు ఆంధ్రప్రదేశ్‌లో పాదరక్షల తయారీ యూనిట్ పనులను వేగవంతంగా ప్రారంభించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. రూ. 300 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ యూనిట్ ద్వారా సుమారు 3,000 మందికి ఉపాధి లభించనుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఒక RND ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని, అలాగే ఆంధ్రప్రదేశ్‌ను రిటైల్ డిస్ట్రిబ్యూషన్ హబ్‌గా మార్చాలని లోకేష్ కోరారు. మాగ్నెటిక్ థెరపీ, కూలింగ్ సోల్స్, యాంటీ బాక్టీరియల్ మెటీరియల్స్ ఏకీకరణతో MFTA సర్టిఫైడ్ మెడికల్ ఫుట్‌వేర్ తయారీలో తమ సంస్థ ప్రత్యేకత కలిగి ఉందని షూ ఆల్స్ చైర్మన్ లీ చియాంగ్ ఎన్ తెలిపారు.

సియోల్ నేషనల్ యూనివర్సిటీ, ఇవాన్స్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌తో కలిసి AI స్మార్ట్ మెడికల్ ఫుట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు లీ చియాంగ్ ఎన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు.

దక్షిణ కొరియాకు చెందిన మరో సంస్థ, ఎలక్ట్రానిక్ షెల్వ్ లేబుల్స్, IOT అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ అయిన సోలం గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీకాప్‌తో కూడా లోకేష్ సమావేశమయ్యారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com