నీట్ పేపర్ లీక్ కేసు: ₹20 లక్షలకు సీట్ల ఆఫర్, OMR షీట్ల తారుమారు ఆరోపణ; గుజరాత్‌లో విద్యార్థి ఫిర్యాదు
నీట్ యూజీ పరీక్ష రద్దు కేసులో కొత్త ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ₹20 లక్షలు చెల్లిస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు ఇప్పిస్తామని, OMR షీట్లను ఖాళీగా ఉంచితే జవాబులు తామే నింపుతామని కొందరు బ్రోకర్లు విద్యార్థులకు ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన శుభమ్ ఠాకూర్ అనే విద్యార్థి ఈ బ్రోకర్లతో జరిగిన ఫోన్ కాల్‌ను రికార్డు చేశాడు. OMR షీట్లు తారుమారు చేసే ముఠా సభ్యుల కాల్‌ను రికార్డు చేసి ఆ ఫోన్ రికార్డింగ్‌ను గుజరాత్ సైబర్ సెల్‌కు ఫిర్యాదు రూపంలో ఇచ్చాడు. ఆ ఫిర్యాదు మేరకు సైబర్ సెల్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణలతో ఇప్పటికే రద్దైన పరీక్షని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ నెల 23న మళ్లీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతారని భావిస్తున్నారు. రీ ఎగ్జామ్ ముందు తాజా ఆరోపణలు రావడంతో విద్యార్థి, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
బ్రోకర్లు పరీక్ష కేంద్రంలోని సిబ్బంది, అధికారులను డబ్బుతో మేనేజ్ చేస్తామని విద్యార్థులకు నమ్మబలికినట్లు రికార్డింగ్‌లో ఉంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com