జాతీయం

NEET UG 2026 పరీక్ష జూన్ 21కి రీషెడ్యూల్ — NTA అధికారిక ప్రకటన

రచన: ఉషా కిరణం డెస్క్ ·
NEET UG 2026 పరీక్ష జూన్ 21కి రీషెడ్యూల్ — NTA అధికారిక ప్రకటన
📷 Mikhail Nilov / Pexels
షేర్ కాపీ అయింది ✓

పేపర్ లీక్ ఆరోపణల కారణంగా రద్దైన NEET UG 2026 పరీక్షను జూన్ 21న నిర్వహిస్తామని National Testing Agency (NTA) ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ తేదీని నిర్ణయించినట్లు NTA తన X ఖాతాలో పోస్ట్ చేసింది.

మే 3న దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అయితే ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని ఆరోపణలు రావడంతో NTA మే 13న పరీక్షను రద్దు చేసింది.

రీ-ఎగ్జామినేషన్ కోసం విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఫీజు చెల్లించిన అవసరం కూడా లేదని NTA స్పష్టం చేసింది. admit cards త్వరలో జారీ చేస్తామని తెలిపింది.

మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ప్రశ్నపత్రం లీక్ అయి రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, కేరళ సహా పలు రాష్ట్రాలకు చేరిందని దర్యాప్తులో తేలింది. రాజస్థాన్‌లోని శిఖర్‌లో 410 ప్రశ్నలతో కూడిన guess paper పరీక్షకు ముందే విద్యార్థులకు అందింది. అందులో 120 chemistry ప్రశ్నలు పరీక్షలో కూడా వచ్చాయని ఆరోపణలు వచ్చాయి. పేపర్ కోసం విద్యార్థుల నుంచి ₹5 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది.

ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశారు. CBI దర్యాప్తు కొనసాగుతోంది. పరీక్షలో అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.

ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నాయి. లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణలో దాదాపు 70 వేల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com