హైదరాబాద్‌లో NGRI రైన్ గార్డెన్ ప్రయోగం: భూగర్భ జలాలు 5-6 మీటర్లు పెరిగాయి
హైదరాబాద్‌లోని NGRI (National Geophysical Research Institute) శాస్త్రవేత్తలు రైన్ గార్డెన్ పద్ధతిని అమలు చేశారు. 2024 మే నుండి ప్రారంభమైన ఈ ప్రయోగంలో రెండు సంవత్సరాల్లో భూగర్భ జలాలు 5 నుండి 6 మీటర్లు పెరిగాయని వారు తెలిపారు.
ఈ పద్ధతిలో తొమ్మిది ఇంకుడు గుంతలు తవ్వారు. వాటిని ఒకదానితో ఒకటి కాలువల ద్వారా అనుసంధానించారు. వర్షం పడినప్పుడు ఒక గుంత నిండగానే నీళ్లు కాలువ ద్వారా తదుపరి గుంతలోకి వెళ్తాయి. ఇలా వర్షపు నీరు వృథా కాకుండా నేలలోకి ఇంకుతుంది.
ప్రతి గుంతలో మూడు పొరలు ఉంటాయి — మట్టి, ఉష్క, కంకర. ఈ పొరల ద్వారా నీరు భూమిలోకి ఇంకేటప్పుడు సహజంగా filter కూడా అవుతుందని NGRI తెలిపింది.
ఇప్పటికే రీచార్జ్ అయిన భూగర్భ జలాలను NGRI వినియోగించుకుంటోంది. అపార్ట్‌మెంట్లలో రైన్ గార్డెన్ నిర్మిస్తే వేసవిలో borewells ఎండిపోకుండా నీళ్ల సమస్య తగ్గుతుందని NGRI శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com