నిర్మల్‌లో రోడ్లు లేక గర్భిణి రోడ్డుపక్కన ప్రసవం; తల్లి, బిడ్డ క్షేమం
నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతంలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఓ గర్భిణి తీవ్ర ఇబ్బందులకు గురైంది. అంబులెన్స్ గ్రామానికి చేరుకోకపోవడంతో ఆమె అటవీ రహదారి పక్కనే ప్రసవించింది.
దొందారి గ్రామానికి చెందిన ఓ ఆదివాసి మహిళకు నిన్న తెల్లవారుజామున ప్రసవ వేదన రావడంతో కుటుంబీకులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అయితే రోడ్లు సరిగా లేకపోవడంతో అంబులెన్స్ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంతివాగు వద్దే నిలిచిపోయింది.
గర్భిణిని ఎడ్లమండిపై అంబులెన్స్ వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా, నొప్పులు ఎక్కువ కావడంతో మార్గమధ్యంలో రోడ్డుపక్కనే ఆమె ప్రసవించింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రసవం తర్వాత ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
అడవి ప్రాంతంలో ఉండే ఈ గ్రామాలకు సరైన రోడ్లు లేకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో కూడా బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com